మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్.. విజయవాడ సబ్ జైలుకు తరలింపు

6:56 am, Sat, 13 June 20

విజయవాడ: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించారు.

అనంతరం జైలు అధికారుల అనుమతితో గుంటూరు జీజీహెచ్‌కు తరలించనున్నారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేశ్ కుమార్‌ను రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు.

ఈ కేసుకు సంబంధించి శుక్రవారం అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేసిన అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే.

ఆయనతోపాటు రమేశ్‌కుమార్‌ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అచ్చెన్నాయుడు, రమేశ్‌కుమార్‌లకు రెండు వారాల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు.