లోపలికి వెళ్తున్నా.. ఏం జరుగుతుందో చూడాలి: అచ్చెన్నాయుడు

- Advertisement -

విజయవాడ: గొల్లపూడి ఏసీబీ ఆఫీసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

ఏసీబీ అధికారులు తనను రమ్మన్నారని, అందువల్ల వచ్చానని తెలిపారు. అధికారులు తనను ఇంతవరకు ప్రశ్నించలేదని చెప్పారు. ‘లోపలికి వెళ్తున్నా, ఏం జరుగుతుందో చూద్దాం’ అన్నారు.

- Advertisement -

బయటకు వచ్చాక అన్ని విషయాలూ చెబుతానని స్పష్టంచేశారు. అంతకుముందే గొల్లపూడి ఏసీబీ ఆఫీసుకు అచ్చెన్నాయుడు న్యాయవాదులు వచ్చారు.

కాగితాలపై అచ్చెన్నాయుడు సంతకాలు తీసుకెళ్తామని లాయర్లు తెలిపారు. అయితే సంతకాలు తీసుకోవడానికి ఏసీబీ అధికారులు నిరాకరించారు. ఏదైనా కోర్టులో తేల్చుకోవాలని న్యాయవాదులకు తేల్చిచెప్పారు.

- Advertisement -