స్టేట్ బ్యాంక్ లో కేఏ‌ పాల్ హల్‌చల్! ఆ డబ్బు నాదే ఇవ్వండి!

4:10 pm, Tue, 19 March 19
AK Paul Viral News in State Bank, AP Paul Latest News, Newsxpressonline

విశాఖపట్నం: ఏపీలో ఎన్నికల వేల ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ విశాఖలో హల్ చల్ చేశారు. జైల్ రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో వాగ్వాదానికి దిగారు.

సొసైటీకి నేనే అధ్యక్షుడిని…

తన సొసైటీ పేరుతో ఉన్న ఫ్రీజ్ అయిన అకౌంట్ లోని డబ్బులు తీసుకునేందుకు అనుమతించాలంటూ గొడవ పడ్డారు. సొసైటీ తనదేనని, సొసైటీకి తానే అధ్యక్షుడినని కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చిందంటూ అధికారులకు తెలిపారు.

ఈ నేపథ్యంలో, మీకు డబ్బు ఇవ్వాలంటే తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని, మీకు డబ్బు ఇవ్వచ్చంటూ ఇంతవరకు తమకు ఆదేశాలు రాలేదని చెప్పారు. అందువల్ల మీకు డబ్బు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు పాల్‌కు స్పష్టం చేశారు. దీంతో, బ్యాంకు అధికారులపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేసి, అక్కడి నుంచి వచ్చేశారు.