రామ్ చరణ్,అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం పై పవన్ ఏమన్నాడో తెలుసా..!

3:31 pm, Sat, 30 March 19
Allu Arjun and Ramcharan Campaigning News, Pavan Kalyan News, Newsxpressonline

అమరావతి: సినిమాలకు స్వస్తి చెప్పి తన శేష జీవితం మొత్తం ప్రజల కోసమే అని ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉందనగా ప్రకటించి 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తెలిపిన మద్దతు ఉపసంహరించుకున్నారు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం రాబోతున్న ఎన్నికలకు వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలావుండగా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ తరపున నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని విలేఖరి అడుగగా..రామ్ చరణ్‌, బన్నిల గురించి అడగ్గా, ఇది మీరు చెబితేనే నాకు తెలిసిందని తెలిపాడు పవన్ కల్యాణ్‌. వారిని స్పెషల్‌గా పాలిటిక్స్‌లోకి పిలిచి ఇక్కడి వాతావరణంలో రుద్దాలని అనుకోవడం లేదు.

కుటుంబ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని, తన అన్నయ్య నాగబాబుని కూడా రాజాకీయాల్లోకి తీసుకురావండ తనకు ఇష్టం లేదని కాని ఏదో అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు పవన్ కల్యాణ్‌.ఒకేసారి సినిమాలు పాలిటిక్స్ అంటే కష్టం. చరణ్ ఒక సందర్భంలో పార్టీ తరుపున ప్రచారం చేస్తాననడం నేను కూడా విన్నానని తెలిపారు.