కరోనా పాజటివ్ కేసుల్లో 5వేల మార్క్ దాటిన ఆంధ్రప్రదేశ్

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 5వేల మార్కును దాటేశాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.

ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నేడు విడుదల చేసింది.

- Advertisement -

దాని ప్రకారం.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5వేలు దాటినట్లు పేర్కొంది.

విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,029 కేసులు నమోదైనట్లు ప్రకటించింది.

గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,085 శాంపిల్స్‌ను పరిశీలించామని, వారిలో 147 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారని వెల్లడించింది.

16 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా కరోనా కారణంగా కృష్ణాలో ఒకరు, అనంతపురం జిల్లాలలో ఒకరు మరణించినట్లు తెలిపింది.

 విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 5029 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది.

వీరిలో 2,403 మంది డిశ్చార్జ్ కాగా, 77 మంది మరణించారని, ప్రస్తుతం 1,510 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -