21 నుంచి ఏపీలోనూ ఆర్టీసీ బస్సులు రైట్.. రైట్! టిక్కెట్ల బుకింగ్ ఆన్‌లైన్‌లోనే…

8:39 pm, Tue, 19 May 20

అమరావతి: ఏపీ ప్రజలకు ఇది శుభవార్తే. కరోనా భయంతో దాదాపు రెండు నెలలపాటు అడుగు బయటపెట్టలేకపోయిన ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 

ఈ నెల 21 నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్టు తెలిపింది. ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

చదవండి: పగబట్టిన ‘కరోనా’.. ఓ కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్.. తండ్రికి రెండుసార్లు…

కాగా, తెలంగాణలో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడిచాయి. అయితే, బస్సులను నగర శివారు వరకు మాత్రమే అనుమతిస్తున్నారు.  

ఈ నెల 21 నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడెక్కనున్న నేపథ్యంలో వీటికి సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

ఇక ఆర్డినరీ బస్సులు కూడా డిపో నుంచి డిపోకు నడవనున్నాయి. ఆర్టినరీ సహా అన్ని రకాల ప్రయాణాలకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది.

చదవండి: టెన్త్ పరీక్షలు.. జూన్ మొదటి వారం తరువాతే, అదీ పరిస్థితి అనుకూలిస్తేనే: తేల్చేసిన హైకోర్టు

టికెట్లు బుక్ చేసుకున్న వారిని మాత్రమే బస్సు ఎక్కేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. కాగా బస్సులో కూడా భౌతిక దూరాన్ని పాటించేలా ప్రభుత్వం బస్సులకు కొత్త రూపు తీసుకొచ్చింది.

కాగా, ఏపీ నుంచి బస్సులను తెలంగాణలోకి అనుమతించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే స్పష్టం చేశారు.