అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రజలకు జగన్ విజ్ఞప్తి

2 days ago
cm-ys-jagan-in-teachers-day-celebration

అమరావతి: అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి స్పందించారు.

ప్రజలు సంయమనం పాటించాలని విఙ్ఞప్తి చేశారు. అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలిపిన తర్వాతే ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించాలని కోరుతూ ట్వీట్ చేశారు.