ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహోగ్రరూపం.. నేడు ఒక్కరోజే 8 వేల కేసులు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చుతోంది. నేడు ఒక్క రోజే దాదాపు 8 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

జిల్లాల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలోనే తొలిసారిగా 7,998 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,391, గుంటూరు జిల్లాలో 1,184, అనంతపురం జిల్లాలో 1,016 కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 72,711 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కేసులతోపాటు మరణాలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. 

గత 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 61 మంది కరోనాకు బలయ్యారు. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో 14 మంది చనిపోయారు.

తాజా మరణాలతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 884కి పెరిగింది. కరోనా నుంచి కోలుకుని తాజాగా 5,428 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 34,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

- Advertisement -