ఏపీలో తగ్గనున్న 30 శాతం సిలబస్.. ప్రభుత్వం సమాలోచనలు

- Advertisement -

అమరావతి: కరోనా వైరస్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. పలు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు ప్రవేశపెట్టినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కారు ఈ విద్యాసంవత్సరంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షలను మార్చి నుంచి ఏప్రిల్‌కు మార్చాలని యోచిస్తోంది.

విద్యాసంవత్సరంలో ఎలాంటి మార్పు చేయకుండా వేసవి సెలవులను మాత్రం మే రెండోవారం నుంచి జూన్‌ 12 వరకు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే, 30 శాతం సిలబస్‌ను తగ్గించేలా పాఠశాల విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది.

- Advertisement -

సిలబస్ తగ్గించటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు ఈ ఏడాది పాఠశాల విద్యా సంవత్సరం ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకూ ఉంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తోంది. అలాగే, ఈ విద్యాసంవత్సరంలో పండగ సెలవులను కూడా తగ్గించే ఆలోచన చేస్తోంది.

- Advertisement -