మచిలీపట్నం: మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రవీంద్రను తుని వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం పెడన నియోజకవర్గం గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అక్కడే వైద్య పరీక్షలు పూర్తి చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అయిదుగురిని అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా భాస్కర్‌రావును హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.