ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వణికిస్తున్న కరోనా.. 25 వేల మార్కును దాటేసిన కేసులు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1,608 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో 21,020 నమూనాలను ప‌రీక్షించగా అందులో 1576 కేసులు ఏపీలో న‌మోదయ్యాయి. మిగ‌తా 32 క‌రోనా కేసులు ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారివి.

దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు సంఖ్య 25,422కి చేరినట్టు ఏపీ వైద్యారోగ్య‌శాఖ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి కోలుకుని 981 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని మొత్తం 13,194 మంది కోలుకున్నారు. అలాగే, క‌రోనాతో మ‌రో 15 మంది మృతి చెంద‌డంతో రాష్ట్రంలో మ‌ర‌ణాల సంఖ్య 292కు పెరిగింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 11,936 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న క‌రోనా వైద్య పరీక్ష‌లు 11 ల‌క్ష‌ల మార్కు‌ను దాటాయి. ఇప్ప‌టివ‌ర‌కు 11,15,635 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రాష్ట్రంలో ప్ర‌తి 10 లక్షల మందికి 20,892 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు తెలిపారు

- Advertisement -