ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు.. నేడు కొత్తగా 1178 నమోదు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,178 కేసులు నమోదు కాగా, 13 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తంగా 21,197 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1155 కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకినట్టు వైద్యాధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు జిల్లాలో నలుగురు, అనంతపూరంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 252కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 85 మంది మరణించగా, కృష్ణా జిల్లాలో 70 మంది కరోనా కాటుకు బలయ్యారు.

- Advertisement -
- Advertisement -