ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా జోరు.. నేడు కూడా 7 వేలు దాటేసిన కేసులు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ జోరు తగ్గడం లేదు సరికదా రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. రాష్ట్రంలో నేడు కూడా భారీ సంఖ్యలో నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 7,813 మంది కొత్తగా కొవిడ్-19 బారినపడ్డారు. ఉభయగోదావరి జిల్లాలను వైరస్ వణికిస్తోంది.

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లాలో 1,324, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,012 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 88,671కి చేరింది.

మరోవైపు, రాష్ట్రంలో మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 52 మంది మృత్యువాత పడ్డారు.

తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు 985 మంది కరోనాతో కన్నుమూశారు. తాజాగా, ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్న 3,208 మంది డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 44,431 మంది వివిధ  ఆసుపత్రుల్లో, క్వారంటైన్ కేంద్రాల్లో, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -