శ్రావణమాసానికి ముందే ఏపీ అలెర్ట్.. పెళ్లిళ్లపై కీలక నిర్ణయం

- Advertisement -

అమరావతి: మరో మూడు రోజుల్లో శ్రావణమాసం వచ్చేస్తుండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రావణంలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉండడంతో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పుడు పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు జరిగితే కేసులు మరింతగా చెలరేగిపోయే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం మరికొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నెల 21 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి వరకు పెళ్లిళ్లలకు కలెక్టర్ నుంచి అనుమతి పొందాల్సి వచ్చేంది.

- Advertisement -

అయితే, కలెక్టర్ నుంచి అనుమతులు పొందే విషయంలో ఆలస్యం అవుతుండడంతో ఆ అధికారాన్ని ఇప్పుడు తహశీల్దార్లకు అప్పగించింది.వివాహా లకు అనుమతి కోరేవారు శుభలేఖతోపాటు నాన్ జుడీషియల్ స్టాంప్ పై అఫిడవిట్ ను తహశీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్‌కార్డుతో పాటు, కరోనా పరీక్షలు చేయించుకున్నట్టుగా వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాలను జతచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

- Advertisement -