అమెరికా వచ్చెయ్.. నా ఫ్రెండ్ ఉన్నాడు… ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం: ఎన్నారై భర్త కిరాతకం

- Advertisement -

గుంటూరు: తాను సంసారానికి పనికి రానని తెలిసీ రూ. 50 లక్షల కట్నం తీసుకుని పెళ్లయిన తర్వాత అసలు విషయం తాపీగా చెప్పిన ఎన్ఆర్ఐ వరుడి బాగోతమిది.

తొలి రాత్రి నుంచే దూరంగా ఉంటున్న భర్తను నిలదీసిన భార్య.. అతడు చెప్పింది విని షాకైంది. తనకు అడాళ్లపై ఆసక్తి లేదని, అమెరికా వచ్చేస్తే అక్కడ తన స్నేహితుడితో ఎంజాయ్ చేయవచ్చంటూ అతడు చెప్పిన మాటలకు విస్తుపోయిందామె.

- Advertisement -

కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఆమె కట్టుకున్న కలల సౌథాలన్నీ కళ్లముందే కుప్పకూలిపోయాయి. ఇక లాభం లేదని నిన్న గుంటూరు పోలీసులను ఆశ్రయించింది.

గుంటూరులోని ఏటీ అగ్రహానికి చెందిన యువతికి ఆర్టీసీ కాలనీకి చెందిన ఎన్ఆర్ఐ యువకుడితో ఈ ఏడాది మార్చి 18న వివాహం జరిగింది. యువకుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడంతో అరకోటి రూపాయలు, 55 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చి మరో రూ. 15 లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశారు.

ఆ తర్వాతి నుంచి అసలు కథ మొదలైంది. తన ఆరోగ్యం బాగాలేదంటూ తొలి రాత్రి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా దూరంగా ఉంటుండడంతో భార్య నిలదీసింది. అప్పుడు అతడు చెప్పిన విషయాలు విని ఆమె షాక్‌కు గురైంది.

తనకు అమ్మాయిలంటే ఇష్టం లేదని, అమెరికాలో తనకున్న బాయ్‌ఫ్రెండ్ కోసమే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అమెరికా వెళ్లిన తర్వాత బాయ్‌ఫ్రెండ్‌కు అప్పజెబుతానని, అతడితో కాపురం చేయాలని, తాను కూడా అతడితోనే ఎంజాయ్ చేస్తానని చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది.

మరి తననెందుకు మోసం చేశావన్న ప్రశ్నకు బదులిస్తూ అమ్మానాన్నలు చేసుకోమంటే కట్నం కోసం పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని అత్త, ఆడపడుచుల దృష్టికి తీసుకెళ్తే.. వాడు సంసారం చేయడని, కావాలంటే బాయ్‌ఫ్రెండ్‌‌ను వెతుక్కోవాలని చెప్పడంతో ఆమె హతాశురాలైంది.

ఈలోపు భర్త అమెరికా వెళ్లపోయాడు. అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదని, అతడితో మాట్లాడాలంటే మరో 10 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టారని బాధితురాలు వాపోయింది.

భర్త, అత్త, ఆడపడుచు తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు నిన్న గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. అయితే, దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. తనకు న్యాయం జరిగేలా చూస్తానని ఎస్పీ హామీ ఇచ్చారని బాధితురాలు పేర్కొంది.

- Advertisement -