అంబేద్కర్‌ను కూడా ప్రభుత్వం తన రాజకీయాలకు వాడుకుంటోంది: నక్కా ఆనందబాబు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఫైరయ్యాడు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం మహానుభావుడైన అంబేద్కర్‌ను కూడా రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెడతామని రాత్రికి రాత్రే ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అమరావతిలోని ఐనవోలు గ్రామ సమీపంలో 20 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనం పనులను ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని నిలదీసింది.

అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలను ఆనాడు జగన్ బహిష్కరించారని ఆనందబాబు గుర్తు చేశారు. ఆనాటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన తర్వాతే టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి పూనుకున్నట్టు చెప్పారు.

- Advertisement -

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా ఆనాడే జగన్, దళితులపై తనకున్న అక్కసును బయటపెట్టారన్నరు. టీడీపీ హయాంలో 20శాతం వరకు పనులు పూర్తయిన స్మృతివనం నిర్మాణాన్ని పక్కనపెట్టిన ప్రభుత్వం.. విజయవాడలోని వివాదాస్పద స్థలంలో విగ్రహం పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును టీడీపీ తప్పుపట్టడంలేదన్న మాజీ మంత్రి.. స్థలానికి చెందిన వివాదాలనే ప్రశ్నిస్తోందని అన్నారు. వివాదాన్ని పరిష్కరించిన తర్వాత మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, అమరావతిలోని స్మృతివనం పనులను కూడా వేగంగా పూర్తిచేయాలని ఆనందబాబు డిమాండ్ చేశారు.

- Advertisement -