జగన్‌లాగే మరో వ్యక్తి! ఎక్కడున్నాడో తెలుసా! టీడీపీకి దొరికితే అంతే సంగతులు!

3:36 pm, Mon, 22 April 19
YS Jagan updates News, AP Latest News, TDP Latest News, Newsxpressonline

గోదావరి ఖని: వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాక, యావత్ దేశం అంతటా మారుమోగిపోతుంది. ఏపీలో జరిగిన ఎన్నికల పైన జాతీయ సంస్థల సర్వే నివేదికలతో జాతీయ స్థాయిలోనూ అందరి దృష్టిని ఆకర్షించారు వైసీపీ అధినేత జగన్ .

ఏపీలో అధికారం లోకి వచ్చేది వైసీపీ నే అనుకుంటున్న వైసీపీ అభిమానులకి, ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త. జగన్ ను పోలిక మరో వ్యక్తి చిత్రం బయటకు వచ్చింది. అచ్చం జగన్ లాగానే ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. మాములుగా మనిషిని పోలిన మనిషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతారు.

చదవండి: జగన్ సొంత సర్వేలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి!

అటువంటిది ఇప్పుడు ఏకంగా ఓ పార్టీ అధినేత అయిన జగన్ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఒక వ్యక్తి ఉండటం తో ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అసలు విషయానికొస్తే…ఆ వ్యక్తిని చూడగానే ఎవరైనా జగనా అని అనుకోవాల్సిందే. జగన్ పాదయాత్ర ప్రారంభించిన సమయంలో కడప జిల్లాలో ఓ వ్యక్తి పొలంలో మంచినీళ్లు తాగుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అచ్చంగా ఆ వ్యక్తి జగన్ లాగానే ఉండటంతో అప్పట్లో ఆ వ్యక్తి ఫుల్ ఫెమస్ అయ్యాడు.

ఇప్పుడు తెలంగాణాలో అదే తరహాలో జగన్ పోలికలతో ఓ వ్యక్తి వెలుగు లోకి వచ్చాడు. కొద్ది రోజులుగా అతడి గురించి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి పేరు రమేష్‌. జగన్ తరహాలో వస్త్ర ధారణ, గడ్డం, చేతులు ఊపటం వంటి వాటితో మరింతగా ఆకట్టుకుంటున్నారు.

ఇక, జగన్ గా అతడిని భావిస్తున్న కొందరు అతడితో వీడియో తీసి సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తున్నారు. అలాగే జగన్‌లా కనిపిస్తున్న ఈ వ్యక్తితో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడ ఉన్న యువత పోటీ పడుతున్నారు.