వైఎస్ జగన్ మరో ఘనత.. ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ల జాబితాలో నాలుగో స్థానం…

7:19 am, Sat, 25 January 20
cm-ys-jagan-in-teachers-day-celebration

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సీఎంగా పేరు సంపాదించుకున్న జగన్.. ప్రముఖ వార్తా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ సర్వేలో ‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్ సీఎం’ల జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఆప్), పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), మూడో స్థానంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నిలిచారు.

నవీన్‌పట్నాయక్, అశోక్‌ గెహ్లట్‌, జగన్‌‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ ఖ్యాతికెక్కారు.