ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం: జగన్

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించదగిన రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం తన ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకేరోజు ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104,108 అంబులెన్స్‌ వాహనాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు జీజీహెచ్‌లో కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ‘ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని, దేశం చూసేలా చాటి చెప్పాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

- Advertisement -