విశాఖ గ్యాస్ లీక్ ఘటన: సీఎం జగన్ తీవ్ర ఆవేదన, సహాయక చర్యల వేగవంతానికి ఉన్నతాధికారులకు ఆదేశాలు…

ap cm ys jagan responded on vizag lg polymers industry gas lekage incident
- Advertisement -

అమరావతి: విశాఖలోని గోపాలపట్నం పరిధిలో ఉన్న ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 

ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన వెంటనే విశాఖ కలెక్టర్, కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు. 

మరోవైపు ఈ రోజు మధ్యాహ్నానికల్లా జగన్ వైజాగ్ వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడంతోపాటు, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. 

విషవాయువు లీకైన ఘటనపై సమాచారం అందగానే భారత నావికాదళం కూడా రంగంలోకి దిగింది. అంబులెన్సులు, మెడికల్ కిట్‌లో బాధితులను కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. 

చదవండి: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి కెమికల్ గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి.. వందలాదిమందికి అస్వస్థత
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య.. మరికాసేపట్లో విశాఖకు జగన్

 

- Advertisement -