కాబోయే సీఎం జగన్ కి చంద్రబాబు ఇచ్చే గిఫ్ట్ ఇదే!

2:15 pm, Mon, 6 May 19
YS Jagan Updates, Chandrababu Naidu Latest Varthalu, AP Political News, Newsxpressonline

అమరావతి: ఏపీలో చంద్రబాబు, జగన్ ఎంతటి శత్రువులో అందరికీ తెలుసు. ఆ శత్రుత్వం రాజకీయంగానే సుమా. ఏపీని దాదాపు 14 ఏళ్లపాటు పాలించిన చంద్రబాబు ఇప్పుడు గద్దె దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన తన శత్రువు జగన్‌కు సీఎం కుర్చీ అప్పగించక తప్పదు.

అందుకే చంద్రబాబు ప్రియమైన తన శత్రువు కోసం అద్భుతమైన గిఫ్ట్ రెడీ చేశారట. అదే.. ఖాళీ ఖజానా.. అవును మరి. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి లెక్కలు చూస్తే జగన్ గుండె గుభేలుమనడం ఖాయం. ప్రస్తుతం ఏపీ ఖాతాలో లక్షన్నర కోట్ల అదనపు అప్పు ఉంది. సుమారు 44 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి.

40 ఇయర్స్ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు.. ఆర్దిక వ్యవస్థ నిర్వహణలో దారుణంగా వైఫల్యం చెందారని కథనాలు వస్తున్నాయి. ఐదేళ్ల పాలన తర్వాత చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదన్నది అంగీకరిస్తున్నట్లుగా పాలన చివరి నెలల్లో కోట్లకు కోట్ల ప్రజాధనం పంచేశారు. పసుపు -కుంకుమ, అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వేలకు వేలు ప్రజల ఎకౌంట్లో నోట్లు వేసి ఓట్లు అడిగారు.

దాంతో ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది. తాజాగా ఆర్దిక శాఖ సమీక్షలో నలభైవేల నాలుగువేల కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నట్టు లెక్క తేలింది. ఆర్దిక సంవత్సరం మొదలై ఏప్రిల్ మొదటి వారంలోనే ఎనిమిదివేల కోట్ల అప్పుకు ప్రభుత్వం వెళ్లింది. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చినా ఏదైనా కార్యక్రమం చేయాలంటే చేతిలో చిల్లిగవ్వలేకుండా చేశారన్నమాట.

చదవండి:  చంద్రబాబుకి వెన్నుపోటు పొడించింది వారేనా!