ఏపీలో ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు

ap cm ys jagan responded on vizag lg polymers industry gas lekage incident
- Advertisement -

అమరావతి: జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐదు రోజుల పనిదినాల వెసులుబాటును మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ సచివాలయం, హెచ్‌వోడీ (శాఖాధిపతుల కార్యాలయాలు) ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

- Advertisement -

గత ఉత్తర్వుల ప్రకారం ఐదు రోజుల పనిదినాల గడువు ఈ నెల 27తో ముగియనుండగా, ఇప్పుడు దీనిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉత్తర్వులపై సచివాలయ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

 

- Advertisement -