సంచలనం: జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం.. విచారణ ఎన్ఐఏకు అప్పగించిన హైకోర్టు

- Advertisement -

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

గతేడాది అక్టోబరులో విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. అప్పట్లో ఇది తీవ్ర సంచలనమైంది. ఏపీ ప్రభుత్వం ఈ కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపిస్తూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేసును ఎన్ఐఏకు అప్పగించాలని కోరారు. వైసీపీ నేతలు పెట్టుకున్న పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.

ప్రభుత్వం వాదనలు వినిపించుకోని ధర్మాసనం…

జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ విచారణ ఆలస్యమైతే న్యాయం జరగదని పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రదేశం కేంద్రం పరిధిలోకి వస్తుందని, కాబట్టి కేసు దర్యాప్తును కేంద్ర సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన కోర్టు ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ జరిగిందని చెప్పినప్పటికీ ధర్మాసనం మాత్రం ఎన్ఐఏకు కేసును అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -