ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ విలయ తాండవం.. ఒక్క రోజే దాదాపు 4 వేల కేసులు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు రోజుకు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 3,963 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఒక రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

కొవిడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది మరణించారు. తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరులో 8, కృష్ణాలో 8, అనంతపురంలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
- Advertisement -