ఏపీ లేటెస్ట్ సర్వే! ఫలితాలు చూస్తే ఆ పార్టీకి చుక్కలే!

10:12 am, Tue, 2 April 19
AP Latest Survey, AP Latest Political News, AP Election News, Newsxpressonline

ఆంధ్రప్రదేశ్: ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో చాలా సర్వేలు తమ ఫలితాలని వివరించాయి. అన్ని సర్వేలు వైసీపీదే విజయమని తేల్చేశాయి. ఈ సర్వే కూడా వైసీపీదే విజయమని తేల్చిన వచ్చే సీట్ల విషయంలో మాత్రం సంచలనం రేపుతోంది. ఈ ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. మోత్తం 175 నియోజక వర్గాల్లో వైసీపీ 85, టీడీపీ 34, జనసేన 1 గెలవగా 55 స్థానాల్లో మాత్రం ఫైట్ టఫ్‌గా ఉండనుందని సర్వే తెలిపింది.

శ్రీకాకుళం.ఈ జిల్లాలో మొత్తం 10 నియోజక వర్గాలున్నాయి. ఈ పదిస్థానాల్లో వైసీపీ 5, టీడీపీ 2 గెలవనున్నాయి. జనసేన మాత్రం ఒక్క సీటుకూడా గెలిచే పరిస్థితులు లేవు. ఇక 3 స్థానాల్లో టీడీపీ, వైసీపీ మధ్యఫైట్ టఫ్‌గా ఉండనుంది.

పాతపట్నం, పలాసా, పాలకొండ నియోజక వర్గాల్లో ఫైట్ టఫ్‌గా ఉండనుంది. విజయనగరం జిల్లాలోని మొత్తం 9 నియోజక వర్గాల్లో వైసీపీ 2, టీడీపీ2 స్థానాలు గెలుచుకోనున్నాయి. 5 స్థానాల్లో మాత్రం ఫైట్ టఫ్‌గా ఉండనుంది. కురుపాం, పార్వతీ పురం, సాలూరు, నెలిమర్ల, విజయనగరం స్థానాల్లో గెలుపు నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ కొనసాగనుంది.

చదవండి : భీమవరం, కడప, కుప్పం ల పై కత్తి మహేష్ తాజా సర్వే

త్రిముఖ పోరు ఖాయమేనా?

విశాఖ మొత్తం 15 నియోజక వర్గాల్లో వైసీపీ 7, టీడీపీ2, జనసేన 1 స్థానాలు గెలుకోనున్నారు. మరో 5 స్థానాల్లో ఫైట్ టఫ్‌గా ఉండనుంది.విశాఖపట్నం ఈస్ట్‌, విశాఖ పట్నం సౌత్‌, విశాఖపట్నం వెస్ట్‌, మాడుగుల, పాయకరావుపేట నియోజక వర్గాల్లో బలమైన పోటీ నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజక వర్గాల్లో వైసీపీ 7, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. 7 స్థానాల్లో పోటీ టఫ్‌గా ఉండనుంది. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, రాజోలు, కొత్తపేట, రాజానగరం, రాజమండ్రి రూరల్ నియోజక వర్గాల్లో ఫైట్ టఫ్‌గా ఉండనుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజక వర్గాలకు గాను వైసీపీ 6, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. 4 నియోజక వర్గాల్లో టఫ్ ఫైట్ కొనసాగునుంది. నర్సాపురం, భీమవరం, దెందులూరు, పోలవరం స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది. నెల్లూరులో ఉన్న మొత్తం పది స్థానాల్లో వైసీపీ 9, టీడీపీ 0, జనసేన 0. ఒక సీట్‌లో గట్టి పోటీ నెలకొంది. నెల్లూరు సిటీస్థానంలో గట్టిపోటీ నెలకొంది. వైసీపీ అభ్యర్ధి అవిల్ కుమార్‌, మంత్రి నారాయణ టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారు.

గుంటూరు మొత్తం 17 నియోజక వర్గాల్లో వైసీపీ 6, టీడీపీ 4 స్థానాలు గెలుచుకోగా జనసేన ఖాతాతెరవనేలేదు. మరో 7 స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. గట్టి పోటీ ఉన్న నియోజక వర్గాల్లో మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, చిలకలూరిపేట, సత్తెనపల్లి స్థానాల్లో గట్టిపోటీ నెలకొంది.

ప్రకాశం జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో వైసీపీ 6, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. 3 స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. పర్చూరు, ఒంగోల్‌, కనిగిరి స్థానాల్లో మూడు పర్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది.

చదవండి : 2019 లో ఏపీ సీఎం ఎవరు? తేల్చేసిన తాజా సర్వే!