ఏపీ లేటెస్ట్ సర్వే! ఏ పార్టీకి.. ఎన్ని సీట్లో చూడండి

12:45 pm, Thu, 2 May 19
AP Latest Survey Updates, AP Latest Political Updates, AP Election, Newsxpressonline

ఏపీ: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా కూడా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర రగిలిపోతుంది. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి , మరోపక్క నేతలు తమ మాటలకి పదునుపెంచడంతో రాజకీయం కూడా హీటెక్కిపోయింది. ఇకపోతే ఎన్నికలు మూసినా కూడా ఎన్నికల ఫలితాల కోసంఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో నేతలు ఓపిక పట్టలేకపోతున్నారు.

అయితే ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో ఎస్సార్సీపీదే విజయమని చెప్పాయి. పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఇప్పటికే బోలెడన్ని సర్వేలు, అధ్యయనాలు అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. వచ్చే ఎన్నికలలో అధికారాన్ని చెప్పట్టాలని అతృతతో ఎదురుచూస్తున్నా వైసీపీ అధినేత జగన్ కి , వైసీపీ నేతలకి ఈ సర్వేలు మంచి జోష్ ఇస్తున్నాయి. ఈ తరుణంలోనే వైసీపీ గెలిస్తే , జగన్ ఏ రోజు సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తాడో కూడా ఇప్పటికే వైసీపీ అధికారికంగా ప్రకటించింది.

చదవండి: కడప, నెల్లూరులో వైసీపీ ప్రభంజనం! సోషల్ మీడియాలో లేటెస్ట్ సర్వే?

అందులో భాగంగా తాజాగా వాట్సాప్ లో ఒక పీడీఎఫ్ ఫైల్ వైరల్ గా మారింది. సీపీఎస్ పేరుతో అది వైరల్ గా సాగుతూ ఉంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అంచనా వేస్తోంది ఈ అధ్యయనం. దీనిలెక్కల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 124, తెలుగుదేశం పార్టీకి 42, ఇతరులకు రెండు సీట్లు దక్కనున్నాయి. మిగతా సీట్లలో పోటాపోటీ పరిస్థితి ఉంది. ఇది ఈ సర్వే ఫలితాలు …

ఇతరుల కేటగిరిలోని సీట్లను జనసేన ఖాతాలోకి కలుపుకోవచ్చునేమో. పోలింగ్ కు ముందు సీపీఎస్ సర్వే ఒకటి విడుదల అయ్యింది. దాని ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యే సీట్లను నెగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు వైరల్ గా మారిన ఈ సర్వేలో కూడా అదే ఫలితమే వెల్లడి అవుతోంది. మరి అసలు ఫలితాలు ఎలా ఉంటాయో మే 23 న తెలియాల్సిందే.