ఏపీ‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు!

11:18 am, Mon, 18 March 19
AP Lok Sabha and Assembly Election Notification Release, Newsxpressonline

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. 25 లోక్‌‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పిన ద్వివేది, వెంటనే జిల్లాల వారీగా కూడా నోటిఫికేషన్‌‌లు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ …

ఈ ప్రక్రియ 11 గంటల్లోపు ముగియాలని, ఆపై నామినేషన్లు స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, మిగతా పార్టీలు వెనకున్నాయి.

తెలుగుదేశం పార్టీ 35 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కరి పేరును కూడా ప్రకటించలేదు. కాగా, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వచ్చేనెల 11న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నోటిఫికేషన్ విడుదలైంది.