ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా పాజిటివ్.. భయాందోళనలో కార్యకర్తలు

- Advertisement -

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన కృష్ణదాసు కుమారుడికి కరోనా సోకింది. శుక్రవారం ఈ విషయం నిర్ధారణ అయింది. మంత్రి తరపున ఆయన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారు.

ఈ కారణంగానే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కుమారుడికి కరోనా పాజిటివ్ రావడంతో నిన్నటినుంచి మంత్రి కృష్ణదాసు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.

- Advertisement -

ఆముదాలవలసలో బుధవారం జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో స్పీకర్ తమ్మినేని కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లారు.

15 రోజుల పాటు క్యాంపు కార్యాలయాలకు రావద్దంటూ ఇప్పటికే కార్యకర్తలకు మంత్రి, స్పీకర్ సూచనలు చేశారు. మంత్రి కుమారుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో తిరిగిన కార్యకర్తలు కూడా భయాందోళనలకు గురవుతున్నారు.

- Advertisement -