టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా.. కోలుకుని తిరిగొస్తానన్న నేత

- Advertisement -

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

వైద్యాధికారుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నానని, ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

తనకు దైవ సమానుడైన చంద్రబాబునాయుడు, అభిమానుల ఆశీస్సులతో కరోనాను జయించి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

- Advertisement -