టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఊరట.. బెయిలు మంజూరు చేసిన కోర్టు

- Advertisement -

అమ‌రావ‌తి: ఏపీటీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. హైకోర్టు ఈరోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఈఎస్ఐ ఆస్ప‌త్రుల మందుల కొనుగోలు కుంభ‌కోణంలో అచ్చెన్నాయుడు ఈ ఏడాది జూన్ 12న అరెస్టు అయ్యారు.

- Advertisement -

హైకోర్టు బెంచ్ నేడు తీర్పును వెలువ‌రిస్తూ ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ. 2 ల‌క్ష‌లు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది.

అదేవిధంగా దేశం విడిచి వెళ్లొద్దని పేర్కొంది. ఏపీ ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయ‌డానికి రెండు రోజుల ముందే ఆయ‌న ఆప‌రేష‌న్ చేయించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఆదేశాల మేర‌కు జులైలో గుంటూరులోని ర‌మేష్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డే జ్యూడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్నారు.

- Advertisement -