ఏపీ సచివాలయంలో వాస్తు దోషాలు….వేగంగా మార్పులు…

AP Secretariat Latest News, AP Political News, AP Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ త్వరలో ఏపీ సెక్రటేరియట్ నుంచి పాలనను చేయనున్నారు.

అయితే సచివాలయంలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయట. సెక్రటేరియట్ ఫస్ట్‌ బ్లాక్‌లో వాస్తు దోషాలు ఉండటంతో.. కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చాంబర్ ఆగ్నేయ మూల నుంచి మార్పు చేయనున్నారు.

ఇక సీఎస్‌కు కేటాయించిన పాత చాంబర్ పక్కనే కొత్తగా మరో చాంబర్ నిర్మించనున్నారు. అలాగే సీఎం చాంబర్‌లోకి వెళ్లే ఓ ద్వారాన్ని కూడా మూసివేయనున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మొదటిసారిగా హైదరాబాద్‌లో అడుగుపెడుతున్నారు. శనివారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ఇస్తున్న ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు.

అలాగే ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 3న గుంటూరులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలోనూ జగన్ పాల్గొంటారు.

చదవండి: జగన్ వేవ్‌లోనూ దగ్గుబాటి గెలవకపోవడానికి కారణం ఇదే…
- Advertisement -