వైసీపీ అధికారంలోకి వస్తే.. కాబోయే మంత్రులు వీరేనా!?

YS Jagan Latest Updates, YCP Ministers News, AP Election News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో గెలుపు తమదేనని గట్టి ధీమాతో ఉంది వైఎస్సార్ సీపీ. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియ‌క‌పోయినా ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావ‌డం ఖాయమని వైసీపీ నేతలు గట్టిగానే నమ్ముతున్నారు.

ఈ హంగామా నేప‌థ్యంలో మంత్రివర్గ జాబితా కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ జాబితా ప్ర‌కారం అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావ్‌కి అవకాశం కలిపిస్తున్నారట. ఆయనను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుతో అధ్యక్షా అని పిలిపించాలని వారందరి ఆశ.

రెవెన్యూ శాఖను ధర్మాన ప్రసాదరావ్‌కి, వ్యవసాయశాఖ మంత్రిగా ఆళ్ళ రామక్రిష్ణా రెడ్డి, ఆర్కే గెలిస్తే మంత్రిని చేస్తానని ఇప్పటికే జగన్ ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రిగా కోన రఘుపతికి అప్పగిస్తున్నారట. ఇక మైనారిటీ సంక్షేమ శాఖ కర్నూల్ లేదా మదనపల్లెలో గెలిచే ఎమ్మెల్యేలలో ఒకరికి ఖాయం చేస్తారట.

 

చదవండి: ఆ రెండు ఎంపీ సీట్లలో క్రాస్ ఓటింగ్ టీడీపీకి ప్లస్….

ఐటీ శాఖ మంత్రిగా జగన్ సన్నిహితుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందట. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారట. అయితే అందరూ అనుకున్నట్టుగా హోం శాఖను కాకుండా సినిమాటోగ్రఫీ,మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్య‌తలను అప్పగిస్తున్నారట. హోం మంత్రిత్వ శాఖ జగన్ తన వద్ద ఉంచుకునే ఆలోచనలో ఉన్నారు.

ఆర్ధిక శాఖ విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. డిప్యూటి స్పీకర్ పదవి గోదావరి జిల్లాల వాళ్లకి ఇవ్వొచ్చు ,అయితే కీలకంగా మారిన నీటి పారుదలను గుడివాడ నుంచి గెలవబోయే కొడాలి నానికి అప్పగిస్తున్నారని అనుకుంటున్నారు. ఇక సీనియర్లు బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం.

అలాగే అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్, మల్లాది విష్ణు, పార్థసారధి, అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, అనంత వెంకటరామిరెడ్డి, మేకపాటి గౌతం, విశ్వేశ్వర్ రెడ్డి ఇలా మరికొంత మంది సీనియర్లు మంత్రివర్గ రేసులో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ కేబినెట్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో హాట్ చ‌ర్చ మొద‌లైంది.
 
- Advertisement -