బాబు వ్యూహానికి జగన్ ప్రతి వ్యూహం!

3:11 pm, Fri, 10 May 19
Chandrababu Naidu Varthalu, YS Jagan Updates, AP Latest Political News, Newsxpressonline
అమరావతి: ఇది  ఏ విధంగా చూసినా 2014 కానే కాదు. అప్పటి జగన్ అంతకంటే కాదు. ఆ సంగతి ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ రుజువు చేసింది. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ టీడీపీని గట్టిగా వైసీపీ ఢీ కొట్టింది. ఎక్కడా తేడా రాకుండా చూసుకుంది. బాబు సైతం ఈసారి కొంత తడబడ్డారు కానీ జగన్ విషయంలో ఏ లోటూ లేకుండా ముందుకు సాగిపోయారు మరి ఆ విధంగా చూసుకుంటే జగన్ సరి సాటిగానే ఈసారి నిలిచారని అనిపిస్తుంది.
ఇక కౌంటింగుకు సమయం దగ్గర పడుతోంది. దాంతో అటు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఆయన నిజానికి చాలా కాలం నుంచే క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తూ పోతున్నారు. వైసీపీ అయితే ఇన్నాళ్ళూ క్యాడర్ కి కూడా రెస్ట్ ఇచ్చేసింది. ఇక కౌంటింగ్ యుధ్ధం ఉంది అక్కడ కూడా బాబు మేనేజ్మెంట్ ని తట్టుకోవాలి. దానికే ఇపుడు జగన్ పై ఎత్తులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తమ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను జగన్ ఈ నెల 19 తరువాత ఒక చోటకు చేర్చే పనిలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. 19న ఎన్నికలు మొత్తం పూర్తి అవుతాయి. ఎగ్టిట్ పోల్ సర్వేలు వస్తాయి. దాంతో టీడీపీ చాణక్య రాజకీయం చేస్తుందని జగన్ భావిస్తున్నారు.

అంతే కాదు. వందకు పైగా మెజారిటీ సీట్లు వస్తే ఫరవాలేదు కానీ బొటా బొటీ మెజారిటీ వస్తే మాత్రం టీడీపీ తమ ఎమ్మెల్యెలకు గేలం వేస్తుందన్న అనుమానం జగన్ కి ఉన్నట్లు చెబుతున్నారు. అందువల్ల తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులను కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగైనా ఈసారి అధికార పీఠం కొట్టాలని జగన్ గట్టిగా భావిస్తున్నారని ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి