మీడియాకి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ!

11:14 am, Thu, 28 March 19
Balakrishna Latest News, Ballaya Babu Latest News, TDP MLA Latest News, AP Political News, Newsxpressonline

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా ప్రతినిధిపై చేయి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

దీనిపై ఆయన మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. ‘‘మీడియా మిత్రులకి నమస్కారం.. నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది.


అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ… మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య పోస్ట్ చేశారు.