జగన్‌కి బిగ్ షాక్! చంద్రబాబు గెలిస్తే.. మళ్ళీ అక్కడే ప్రమాణ స్వీకారం!

3:11 pm, Wed, 1 May 19
YS Jagan Updates, Chandrababu Naidu Varthalu, AP Latest Political News, Newsxpressonline

అమరావతి: ఏపీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమనే భావనలో ఉన్న వైసీపీ… ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకుందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే మే 26న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని టాక్ వినిపిస్తోంది.

అయితే తాజాగా ఈ విషయంలో టీడీపీ కూడా తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చదవండి:  వైసీపీ ఈ ఎన్నికలలో ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటో చూడండి!

వైసీపీ ఎంతగా ప్రచారం చేసుకున్నా అంతిమంగా గెలుపు తమదే అని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

2014 జూన్ 8న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలోనే మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్టు టీడీపీ వర్గాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు మళ్లీ గెలిస్తే అదేచోట…

అప్పట్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు మళ్లీ గెలిస్తే అదేచోట తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈసారి గతంలో మాదిరి కాకుండా ఫలితాలు వచ్చిన రెండు రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని… ఇందుకోసం మే 25న ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ… టీడీపీ, వైసీపీ అధినేతల ప్రమాణ స్వీకారానికి మాత్రం ముహూర్తాలు ముందుగానే ఖరారయ్యాయనే వార్తలు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

చదవండి: ఈ ఎన్నికలలో జగన్ ఓడిపోతే జరిగేది అదేనా …?