జనసేనానికి భారీ షాక్ ఇచ్చిన మెగా హీరో! వైసీపీ అభ్యర్థికి మద్దతుగా…

9:48 am, Sun, 7 April 19
pawan-jagan

హైదరాబాద్: అవును మీరు చదివింది నిజమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనల్లుడు అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా మాట్లాడారు.  అదేంటి? ఇస్తే గిస్తే పవన్‌కే మద్దతు ఇస్తాడు కానీ వైసిపికి మద్దతుగా నిలవడటమేంటని అనుమానంగా ఉందా ?

అరె, మొన్నటికి మొన్న ‘ఐ సపోర్ట్ యూ.. ఐ ఎంకరేజ్ యూ.. అండ్ వియ్ ఆర్ విత్ యూ..’’ అని ట్వీట్ చేస్తూ తన చిన్న మావయ్య పవన్ కళ్యాణ్‌ పార్టీ జనసేనకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. రెండ్రోజులకే ప్లేటు ఫిరాయించాడేమిటో అని ఆశ్చర్యపడకండి. 

శిల్పా రవికి మద్దతుగా…

దీనికి ఆయనవైపు నుంచి సరైన కారణమే ఉంది. అయితే బన్నీ మద్దతు టోటల్‌గా వైసీపీ పార్టీకి కాదులెండి, ఒక్క నంద్యాలలో ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మాత్రమే. ఈ స్థానంలో రవిచంద్ర మాత్రం గెలవాలనేది బన్నీ ఆకాంక్ష.

మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కొడుకే.. ఈ రవిచంద్ర కిషోర్ రెడ్డి. రవి తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని అల్లు అర్జున్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మంచి వ్యక్తులు ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని బన్ని వ్యాఖ్యానించారు.

చదవండి: మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ మీకే: జనసేనకు అల్లు అర్జున్ మద్దతు, అధికారిక లేఖ విడుదల…

శిల్పా రవి గెలిస్తే సమాజానికి మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి రవి విజయంతో ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షించారు. నిజానికి ఇక్కడ జనసేన తరపున సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ బన్నీ మాత్రం వైసీపీ అభ్యర్ధే గెలవాలని కోరుకున్నారు.

అదేమిటంటే.. రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరన్నారు. రవితో తనకు చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని బన్నీ చెప్పారు. జనసేన అభ్యర్ధిని కాదని వైసిపి అభ్యర్ధి గెలవాలని అర్జున ట్విట్టర్, ఇన్‌స్టా‌గ్రామ్ మెసేజ్ పెట్టడంతో వైసీపీ శ్రేణులు మంచి జోష్‌తో ఉన్నారు.