చంద్రబాబుని పరిగెత్తించి.. ఆ సమయం దగ్గర్లోనే ఉంది! వైసీపీ నేత హాట్ కామెంట్స్…

6:03 pm, Fri, 19 April 19
botsa hot comments on cm chandrababu, newsxpress.online
botsa hot comments on cm chandrababu, newsxpress.online

అమరావతి: వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కోడ్ అమల్లో ఉంటే సమీక్షా సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ మండిపడ్డారు. తాను అన్నింటికి అతీతుడ్ని భావించడం సరికాదని, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని చంద్రబాబుకు హితవు పలికారు.

బాబుని ప్రపంచం అంతా తిరస్కరించింది…

చంద్రబాబు ఈ రాష్ట్రంలో పూర్తిగా విశ్వాసం కోల్పోయారని, రాష్ట్రంలోని పార్టీలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఆయన పక్షాన ఉన్నది రాష్ట్రంతో సంబంధంలేని కొన్ని జాతీయ పార్టీలు, తన జాతి నేతలు మాత్రమేనని బొత్స ఎద్దేవా చేశారు. ఈ రెండు అంశాలు తప్ప చంద్రబాబును తక్కిన ప్రపంచం అంతా తిరస్కరించిందని వ్యాఖ్యానించారు.

చదవండి: లోకేష్‌కి మరో కొత్త పేరు! ఆటాడేసుకుంటున్న వైసీపీ శ్రేణులు!!

చంద్రబాబు తన పార్టీ నేతలతో తరచుగా టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ వాళ్లకు కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. తామే గెలుస్తున్నామని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేది తానేనని చెబుతున్నారు. అంతేకాకుండా, మీకు పరిచయం ఉన్న వైసీపీ శాసనసభ్యులు, వైసీపీ అభ్యర్థులతో పరిచయాలు పెంచుకోండి అని చెబుతున్నారట.

మళ్లీ ఇదో లాజిక్కు, మరో మోసానికి తెరలేపారు, చంద్రబాబునాయుడు గారూ, ప్రజలు అమాయకులు కాదు, మిమ్మల్ని రాళ్లతో కొడతారు, పరిగెత్తించి మరీ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొడతారు. మీకెలాగూ అమరావతిలో సొంత ఇల్లు లేదు. హైదరాబాద్‌లో సొంత ఇల్లుంది కాబట్టి అక్కడికే వెళ్లిపోండి. లేకపోతే జాతీయపార్టీల్లో ఎవర్నో ఒకర్ని అడిగి వాళ్ల రాష్ట్రం వెళ్లిపోండి అంటూ నిప్పులు చెరిగారు.

చదవండి: 65 చోట్ల పోటీ చేస్తే 88 స్థానాలలో గెలుస్తారా?: జనసేన లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి…