350 డమ్మీ ఈవీఎంల కలకలం: హైదరాబాద్-విశాఖకు, వైసీపీ నేతవేనా?

6:24 pm, Wed, 3 April 19
Fake EVM Latest News, YCP Leaders News, AP Political News, Newsxpressonline

పశ్చిమ గోదావరి: జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. 350 డమ్మీ ఈవీఎంలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖకు వ్యాన్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు.

హైదరాబాద్ టు విశాఖ..

స్వాధీనం చేసుకున్న ఈ డమ్మీ ఈవీఎంలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పోలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడికి కొన్ని డమ్మీ ఈవీఎంలను అప్పగించి మిగతావి విశాఖ జిల్లాకు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పినట్టు సమాచారం.

ఓటర్లతోపాటు పార్టీలు తమ నేతలకు అవగాహన కార్యక్రమాల కోసం వీటిని తీసుకెళుతున్నట్లు భావిస్తున్నారు పోలీసులు. అయితే, డమ్మీ ఈవీఎంల విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చదవండి: షర్మిల, మోహన్ బాబు వచ్చినా నా విజయాన్ని ఆపలేరు: లోకేష్