లోకేష్ చెల్లని కాణీయా? మరి వైఎస్ విజయమ్మ సంగతేంటి?: బుద్ధా వెంకన్న ఫైర్

5:54 pm, Mon, 8 July 19
tdp-mlc-buddha-venkanna

అమరావతి: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కొడుకు, మంత్రి అయి ఉండి ఓడిపోయిన లోకేష్ చెల్లని కాణీ అనడంపై ఆయన మండిపడ్డారు. 

చదవండి: ఇక ‘ఫ్రీ బర్డ్’: ఎంజాయ్ చేస్తోన్న రాహుల్ గాంధీ! మొన్న థియేటర్‌లో సినిమా, నిన్న హోటల్లో దోశ…

ఒకసారి ఓడిపోతేనే చెల్లని కాణీ అంటే, మరి 2014లో మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలై ఉండీ వైఎస్ విజయమ్మ 70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు కదా? మరి ఆమెని ఏమనాలి అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న.

వాళ్ళని ఏమని అనాలో చెబుతారా?

అంతేకాదు, మీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన సొంత బాబాయిని, సొంత ఊరిలో గెలిపించుకోలేకపోయారు కదా? మరి వాళ్ళని ఏమని అనాలో మీరు చెబుతారా విజయసాయిరెడ్డి? అంటూ నిలదీశారు. 

నారా లోకేష్ ఓటమిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. సీఎం కొడుకు, మంత్రి అయి ఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేష్ చెల్లని కాణీ అయిపోయాడు అంటూ ఆయన ట్వీట్ చేయగా.. అందుకు కౌంటర్  ఇచ్చారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 

చదవండి: కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టనున్న.. పూరి జగన్నాథ్, ఛార్మీ!