ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిపోతున్న కరోనా.. 24 గంటల వ్యవధిలో 796 కేసులు నమోదు

- Advertisement -

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి చెలరేగిపోతోంది. గ‌త కొన్నిరోజులుగా వంద‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్రవారం మ‌ధ్యాహ్నం నుంచి శ‌నివారం వరకు 24 గంటల వ్యవధిలో 796 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 12,285కు పెరిగింది. ఇక, మొత్తం కేసుల్లో 6,648 యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 11 మంది క‌రోనాతో కన్నుమూశారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 157కు చేరుకుంది.

- Advertisement -
- Advertisement -