ఏపీ సీఎం జగన్‌ను ఫేస్‌బుక్‌లో దూషించాడని..

7:12 am, Sun, 12 January 20
cm-ys-jagan-in-teachers-day-celebration

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఫేస్‌బుక్‌ ద్వారా అసభ్య పదజాలంతో దూషించాడంటూ బిల్లుపాటి రవిపై మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దంతులూరి రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవి ఈనెల 8న ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఒక వీడియో అప్‌లోడ్‌ చేశాడు. అందులో సీఎం జగన్‌, ఉప ముఖ్యమంత్రి పుష్పవాణి, నగిరి ఎమ్మెల్యే రోజాలను అసభ్యపదజాలంతో దూషించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.