వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ ముమ్మర విచారణ!

- Advertisement -

కడప: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసుపై సీబీఐ విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలో పులివెందులలోని వివేకా నివాసాన్ని, పరిసర ప్రాంతాలను సీబీఐ అధికారులు క్షుణ్ణంగా

పరిశీలించారు. వాచ్‌మెన్ గంగన్నతో పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డిలను మూడు గంటలపైగా విచారించారు. హత్య జరిగిన రోజు, అంతకుముందు జరిగిన పరిణామాలపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. వైఎస్

- Advertisement -

కుటుంబంలో ముఖ్యమైన వారిని సీబీఐ శనివారం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రంగయ్యను సిట్‌ బృందం గతంలో కూడా పలుమార్లు విచారించింది. నార్కో అనాలసిస్‌ పరీక్ష చేయడానికి తీసుకెళ్లి, అతని వయసు రీత్యా నార్కో అనాలసిస్‌ చేయకూడదని తెలిసి వెనక్కి తీసుకొచ్చారు.

- Advertisement -