చంద్రబాబు ఆడియో టేపు లీక్! ఏముందో చూడండి?

chandrababu audio tape leak
- Advertisement -

అమరావతి: ఏపీలో ఎన్నికల వేల సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆడియో టేపు వేడి చల్లారక ముందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన మరో ఆడియో టేపు వెలుగులోకి వచ్చింది. వైఎస్ జగన్ నిన్న కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలతో మాట్లాడినట్లు ఈ ఆడియో టేపులో ఉంది.

సాక్షి టీవీ ప్రసారం చేసిన ఈ ఆడియో టేపులో టీడీపీ స్థానిక నేత ఒకరు మాట్లాడుతూ..‘ఈరోజు జగన్ ప్రోగ్రామ్ ఉంది సార్. 9.30 గంటలకు కుప్పానికి వస్తున్నారు. ఆ సమావేశానికి కుప్పం నుంచి మనవాళ్లు, మన ఓటర్లు ఎవ్వరూ వెళ్లరు. ఎవరైనా వెళితే ఈజీగా తెలిసిపోతుంది. ఓ 10 మందో, 20 మందో వెళ్లేవారుంటే తెలిసిపోతుంది’ అని చెప్పారు.

దీనికి చంద్రబాబు స్పందిస్తూ..‘అసలు మీటింగ్ కే పోకూడదు. ఎవరు పోయినా నోట్ చేసుకుంటే భవిష్యత్తులో మనకు ఓ ఐడియా ఉంటుంది. మనం ఏం చేయాలన్నది ఇప్పుడు మాట్లాడనక్కర్లేదు. మనం మళ్లా వాళ్లను చూసుకుందాం.

వాళ్లకు ఏ బెనిఫిట్ కూడా ఇవ్వకుండా, నార్మల్ గా వచ్చేవి ఏమీ ఇవ్వకుంటే సరిపోతుంది. రాష్ట్రంలో కానీ, కుప్పంలో కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి.
స్థానికంగా ఉండే నాయకులు తెలిసో, తెలియకో కొందరిని హర్ట్ చేసుంటారు. మనవల్ల హర్ట్ అయినవాళ్లు ఉంటారు.

అలాంటివాళ్లే ఎన్నికలప్పుడు ఇది చేస్తారు. మనమే కొంచెం తగ్గి ఓసారి క్షమాపణ అడిగి, సారీ.. మీరు హర్ట్ అయ్యారు అని వాళ్లను కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలి. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పాల్సిన అవసరం ఉంది.

లేకపోతే ఒక్క ఓటు పోయినా మనకు నష్టం వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఆడియో టేపుపై టీడీపీ వర్గాలు కానీ, సీఎం కానీ ఇంతవరకూ స్పందించలేదు.

- Advertisement -