సర్వేలన్నీ టీడీపీకే అనుకూలం.. గెలుపుపై సందేహాలు వద్దు: టీడీపీ శ్రేణులతో చంద్రబాబు

9:29 pm, Sat, 4 May 19
chandrababu comments on tdp wining

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో పాలనమీద, వ్యవస్థను గాడిలో పెట్టడం మీద శ్రద్ధ పెట్టానని, ఇకపై పార్టీకి పూర్తి ప్రాధాన్యత ఇస్తానన్నారు. కనీసం రోజుకు రెండు గంటలు పార్టీకి కేటాయిస్తానని చెప్పారు.

ఈ రోజు సాయంత్రం రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే  సర్వేలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, ఇది పార్టీకి, రాష్ట్రానికి శుభసంకేతంగా భావిస్తున్నామని చెప్పారు. ఇక కార్యకర్తలు, నేతలు గెలుపుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి ఆధిక్యతను తెచ్చుకోవాలని కార్యకర్తలకి సూచించారు.  అలాగే మూడ్ ఆఫ్ ద పీపుల్ అందరూ పసిగట్టాలని, ప్రజల నాడిని పసికట్టే వాడే నాయకుడు అవుతాడని చెప్పారు.

ఇక ప్రతి 3నెలలకోసారి అన్ని నియోజకవర్గాలను స్వయంగా మానిటర్ చేస్తానని, స్థానిక నాయకత్వం మెరుగుపడాలని. ఏ స్థాయి నాయకుడైనా కనీసం 100 ఓట్లను ప్రభావితం చేయాలన్నారు.

చదవండి: సీఎస్ వర్సెస్ సీఎం! చంద్రబాబు, ఎల్వీ వార్ ఎప్పటివరకు?