‘‘చంద్రబాబు సెక్రటేరియట్‌కు రావచ్చు.. కానీ ఈసీకి లోబడే నిర్ణయాలు తీసుకోవాలి..’’

11:18 am, Fri, 19 April 19
Chandrababu Naidu Latest News, AP Political News, EC Latest News, Newsxpressonline

అమరావతి: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఇతర మంత్రులు కూడా సెక్రటేరియట్‌కు రావచ్చని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కొన్ని సమీక్షలను కూడా ముఖ్యమంత్రి నిర్వహించవచ్చని అన్నారు.

పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల్లో… ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనే విషయం స్పష్టంగా ఉందని ద్వివేది చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు వారివారి కార్యాలయాల్లో కూర్చోవచ్చని, అయితే రాజకీయపరమైన పనులను మాత్రం చేపట్టకూడదని ఆయన పేర్కొన్నారు.

చదవండి: చంద్రబాబు నాలుగోసారి సీఎం కాబోతున్నారు! రెడ్డి చెరువు సిద్ధాంతి సంచలన వ్యాఖ్యలు!

ముఖ్యమంత్రి సమీక్షలపై తమకు వైసీపీ ఫిర్యాదు చేసిందని, దీనిపై చీఫ్ సెక్రెటరీ ద్వారా సంబంధింత అధికారుల నుంచి నివేదిక కోరుతామని, వారి నివేదికల ఆధారంగా చర్యలు చేపడతామని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది చెప్పారు.

ఈ నెల 10వ తేదీన చంద్రబాబు తమ కార్యాలయానికి వచ్చి మాట్లాడిన అంశాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందని, సీఈసీ కోరిక మేరకు సీఎం మాట్లాడిన మాటలను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నివేదికను పంపామని కూడా ఆయన వివరించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై కూడా సీఈసీకి నివేదిక పంపామని ద్వివేది తెలిపారు.
చదవండి: 65 చోట్ల పోటీ చేస్తే 88 స్థానాలలో గెలుస్తారా?: జనసేన లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి…