చంద్రబాబును వైసీపీలో చేర్చిన ఆర్జీవీ!

7:34 am, Sun, 14 April 19
rgv, ramgopal varma, tollywood, filmnews , ysrcp, ycp, Newsxpressonline

హైదరాబాద్: కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ మరోసారి కొత్త వివాదంతో వచ్చారు. ఈసారి ఏకంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీలో చేర్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీలో చేరుతున్నట్టు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబుకు తమ పార్టీ కండువా కప్పుతున్నట్టు ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో వర్మ ఈ పోస్ట్ చేశారు.

అది మార్ఫింగ్ చేసిన ఫొటోనే. ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, టీడీపీ ఓడిపోతుంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఏకంగా చంద్రబాబునాయుడు కూడా పార్టీ మారిపోయారంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవల రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశారు.

అయితే, అందులో చంద్రబాబును విలన్‌గా చూపించారని, ఈ సినిమాను ఎన్నికల సమయంలో విడుదల చేయడానికి వీల్లేదంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన చోట్ల ఆ సినిమా విడుదల అయింది. న్యాయపరమైన చిక్కుల వల్ల లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో విడుదల కాలేదు. ఇలాంటి సమయంలో రామ్ గోపాల్ వర్మ ఇలాంటి కామెంట్స్‌తో చంద్రబాబు వైసీపీలో చేరుతున్నట్టు ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం టీడీపీ వారిని మరింత రెచ్చగొట్టేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.