అచ్చెన్నాయుడును కలవడానికి చంద్రబాబుకు అనుమతి నిరాకరణ

- Advertisement -

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురయింది.

అనారోగ్యం కారణంగా అచ్చెన్నాయుడు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడును పరామర్శించడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమతి కోరారు.

- Advertisement -

అయితే ఆయనకు ఈ అనుమతి లభించలేదు. దీనికోసం చంద్రబాబు చేసుకున్న అభ్యర్థనను జైళ్ల శాఖ అధికారులు తిరస్కరించారు.  కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని జైళ్ల శాఖ స్పష్టంచేసింది.

2 నెలలుగా ఇలాంటి అనుమతులు ఎవరికీ ఇవ్వడం లేదని అధికారులు చెప్పారు. అలాగే చంద్రబాబు వినతిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ స్పందించారు. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూచన చేశారు.

- Advertisement -