అతిపెద్ద అఫిడవిట్: జగన్‌పై చంద్రబాబు సెటైర్లు, ఏపీ ఆస్తులపై కేసీఆర్ కన్నేశారంటూ..

3:23 pm, Sat, 23 March 19
chandrababu slams YS Jagan and KCR News, Chandrababu Latest News, AP Latest News, Newsxpressonline

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌పై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అతిపెద్ద అఫిడటవిట్‌ను జగన్ దాఖలు చేశారని, 31 కేసుల్లో నిందితుడిగా, ఇన్ని నేరాలతో ఇంకెవ్వరూ అఫిడవిట్ దాఖలు చేయరని ఎద్దేవా చేశారు.

ఆంధ్రా ఆస్తులపై కేసీఆర్ కన్నేశారు..

శనివారం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పించారు. జగన్ ద్వారా ఆంధ్రా ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆ కుట్రను తాము చూస్తూ ఊరుకోబోమని అన్నారు.

తెలంగాణలో డిక్టేటర్ మాదిరి తయారైన కేసీఆర్.. ఆంధ్రాను జగన్ ద్వారా డిక్టేట్ చేయడానికి చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని జగన్.. కేసీఆర్‌కు అమ్మేస్తున్నాడనే భావన ప్రజల్లో బలపడుతోందని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ చెడగొడుతూ ప్రతి ఒక్కరూ ఛీకొట్టే పరిస్థితికి కేసీఆర్ తెస్తున్నారని విమర్శించారు.

మోడీ, కేసీఆర్, జగన్ ఏపీపై పెద్దనం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఓటుతో గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ఒత్తిడితోనే వివేకా కూతురు కూడా తండ్రి చావును రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు.