‘అయోధ్య తీర్పు’పై చంద్రబాబు స్పందన ఇదీ..

5:34 pm, Sat, 9 November 19

అమరావతి: చారిత్రాత్మక అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తుది తీర్పుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. దశాబ్దాలుగా నలుగుతూ హిందూ, ముస్లింల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన రామజన్మభూమి స్థలాన్ని హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వివాదాస్పద భూమి హిందువులదేనని తేల్చి చెప్పింది. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ అనంతరం నేడు అంతిమ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందించారు.

అయోధ్య అంశంపై న్యాయమూర్తుల ప్యానెల్ వెలువరించిన ఏకగ్రీవ నిర్ణయాన్ని తప్పక గౌరవించాల్సిందేనన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు శాంతి, సామరస్యతలను పాటించాలని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు.