మే 23 తరువాత చంద్రబాబు రిటైర్మెంట్! ‘ది ఎకనామిక్ టైమ్స్’ వెల్లడి!

10:39 am, Sat, 27 April 19
Chandrababu Latest News, TDP Latest News, AP Political News, Newsxpressonline

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుకు దాదాపు అన్ని దారులూ మూసుకుపోయాయని.. ‘ది ఎకనమిక్స్ టైమ్స్’ పత్రిక విశ్లేషణాత్మక కథనం అందించింది. ఇది ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిస్తే, ఇక చంద్రబాబుకు అన్ని దారులూ మూసుకుపోయినట్టే అని ఆ పత్రిక విశ్లే్షించింది.

2004 నుంచి చంద్రబాబు రాజకీయ పోకడలను సునిశితంగా విమర్శించిన ఆ పత్రిక.. చంద్రబాబు ఎత్తుగడలు ఎలా విఫలమైందీ డిటైల్డ్ గా చర్చించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా తప్పుటడుగులు వేసారని చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను వివరించారు.

పవన్ కల్యాణ్ పార్టీ వేరుగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత చీలుతుందని చంద్రబాబు తప్పుగా అంచా వేశారని ఆ పత్రిక పేర్కొంది. మోడీకి వ్యతిరేకంగా వేవ్ ఉందని కూడా చంద్రబాబు తప్పుగా అంచనా వేశారని ఆ పత్రిక విశ్లేషించింది.

చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా క్యాస్ట్, కరప్షన్, క్రైమ్ గా సాగిపోయిందని ఆ పత్రిక రాసుకొచ్చింది. ఇది ప్రజావ్యతిరేకతను పెంచిందని పేర్కొంది. అలాగే జగన్‌కూ కేసీఆర్ కూ ముడిపెడుతూ చంద్రబాబు సాగించిన ప్రచారం ప్రజలను నమ్మించలేకపోయిందని కూడా ఆ పత్రిక విశ్లేషించింది.

మొత్తానికి చంద్రబాబు ఓడిపోతాడనే ఒక్క మాట రాయకపోయినా కథనం మొత్తం చదవాక మనకు అర్థం అయ్యేది అదే. మే 23 న చంద్రబాబు రిటైర్ కాబోతున్నారన్నదే ఈ కథనం సారాంశం